Tuesday, July 28, 2015

Lakshmi Devi Samarpinchu Nede Chudandi Movie Logo Launch






‘లక్ష్మీదేవి సమర్పించు’ నేడే చూడండి టైటిల్ లోగో ఆవిష్కరణ
కలర్స్ అండ్ క్లాప్స్ ఎంట్ టైన్మెంట్స్ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మాతగా, సహ నిర్మాతగా సిరాజ్, జాకీ అతిక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’. ఈ చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. నరేష్ టైటిల్ లోగోను ఆవిష్కరించారు.హీరో హీరోయిన్లకు ఆదరణ పెరిగి వారినే దైవంగా భావిస్తే అభిమానులు వారికి పూజలు చేయడం వంటి చర్యలను గమనించిన దేవుళ్లు మనమే చిత్ర నిర్మాణం ఎందుకు చేయకూడదని భావించి లక్ష్మీదేవి నిర్మాతగా,నారదుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ చిత్ర పరిశ్రమలో నటన, ఫోటోగ్రఫీ, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న ముగ్గురు యువకులను పరిచయం చేస్తూ ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’ అనే సినిమా తీస్తారు. చిత్ర నిర్మాణంలో దేవుళ్లకు కూడా  ఇబ్బందులు తప్పవని తెలసుకుంటారు. ఈ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందింది. నరేష్, ఆమని లక్ష్మీదేవి, విష్ణుమూర్తిలుగా నటిస్తే ప్రముఖ నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ-జనని, అఖిల్-భార్గవి, చరణ్-ప్రగ్నా జంటలుగా నటించారు. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలను ఆగస్టు మూడో వారంలో విడుదల చేయాలనుకుంటున్నట్టు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి రఘురామ్ కంపోజన్ లో గీతామాధురి, మాళవిక పాడిన ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, రామకృష్ణగౌడ్, గీతాసింగ్, గౌతంరాజు సహా దర్శక నిర్మాతలు, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటి, కెమెరా: రఘు ఆర్.బళ్లారి, లైన్ ప్రొడ్యూసర్: నాగేంద్ర గాదెం శెట్టి, సహ నిర్మాత: సిరాజ్,కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జాకీ అతిక్.




No comments:

Post a Comment