Wednesday, July 22, 2015

జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’





అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై  రూపొందిన చిత్రం జేమ్స్ బాండ్. నేను కాదు నా పెళ్లాం ట్యాగ్ లైన్.  సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందింది. అల్లరి నరేష్ కామెడి ప్రేక్షకులకు మంచి కామెడి టానిక్ అవుతుంది. అలాగే సాక్షి చౌదరి చక్కగా నటించింది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతానందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
ఆశిష్ విద్యార్థిచంద్రమోహన్జయప్రకాష్ రెడ్డిరఘుబాబుకృష్ణభగవాన్పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపానపాటలు: రామజోగయ్య శాస్త్రివిశ్వభువనచంద్రఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయడ్యాన్స్: రాజసుందరంగాయత్రి రఘురాంప్రసన్నఎడిటింగ్: ఎం.ఆర్.వర్మకెమెరా: దాము నర్రావుసంగీతం: సాయి కార్తీక్కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకరఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటిప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకరస్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ. 






No comments:

Post a Comment