Tuesday, August 4, 2015

Hora Hori Movie Working Stills








హోరా హోరీ సెన్సార్ పూర్తి
'అలా మొదలైంది, ‘అంతకుముందు ఆ తరువాతవంటి ఘనవిజయం సాధించినవైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. 'చిత్రం, ‘నువ్వు నేనుజయంఅంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'హోరా హోరీ.  నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించివిజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు 'తేజస్టయిల్.   చిత్రాన్నికూడా ఆయన నూతన నటీ నటులతోనే తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు తేజ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథాచిత్రాలు ఎంతటి ఘనవిజయాన్ని సాధించాయో మనకు తెలిసిందే. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా హోరా హోరీ చిత్రం అద్భుతంగా వచ్చిందని చిత్రయూనిట్ వర్గాలు తెలియజేశాయి.
 కొత్త నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్,బాలకుమారన్కెమెరా: దీపక్ భగవంత్ఎడిటర్: జునైద్కాస్ట్యూమ్ డిజైనర్శ్రీ;  స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్కెవిన్సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్లజగన్ మోహన్ రెడ్డి. వి నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ. 

No comments:

Post a Comment